కామారెడ్డి టౌన్: బతుకమ్మ పండుగ నేపథ్యంలో ఆడపడచులకు ప్రభుత్వం కానుకలు పంపిణీ చేయడానికి సిద్ధమవుతోంది. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా రేవంతన్న కానుక పేరుతో చేనేత చీరలను పంపిణీ చేయనుంది. అయితే గత ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి మహిళకు ఒక చీర పంపిణీ చేయగా.. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) సభ్యులకు మాత్రమే పంపిణీ చేయనుంది. జిల్లాలో మొత్తం 2,03,689 చీరలను అందించనున్నారు. ఇందులో పట్టణాల్లో 24,272, ఇతర ప్రాంతాలలో 1,79,417 చీరలను పంపిణీ చేయనున్నట్లు డీఆర్‌డీఏ, మెప్మా అధికారులు తెలిపారు.
మారథాన్ రన్నింగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా అశోక్
కామారెడ్డి రూరల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అ మరావతిలో వచ్చేనెల 2న నిర్వహించే స్వచ్ఛతాన్ ఆఫ్ మారథాన్ ర న్నింగ్‌కు జిల్లా రవాణా శాఖ ఉద్యోగి గుగ్గిలం అశోక్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. నిజామాబాద్ జిల్లా వే ల్పూర్ గ్రామానికి చెందిన అశోక్ పలు జాతీ య, అంతర్జాతీయ మారథాన్ పోటీల్లో పాల్గొ ని విజయాలను సాధించారు. ఆయనను అమరావతి మారథాన్‌కు ఎంపిక చేయడంపై క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ బ్రాండ్ అంబాసిడర్‌గా..
కామారెడ్డి టౌన్: ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ జిల్లా బ్రాండ్ అంబాసిడర్‌గా జిల్లా సైన్స్ అధికారి సిద్దిరాంరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు నేషనల్ గ్రీన్ క్రార్ప్స్(ఎన్‌జీసీ) డైరెక్టర్ ప్రసన్నకుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తనను నియమించినందుకు విద్యాశాఖకు, ప్రభుత్వానికి, జిల్లా అధికారులకు సిద్దిరాంరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

ఆడపడచులకు బతుకమ్మ కానుక