
ఐఐహెచ్‌పీ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
కామారెడ్డి టౌన్: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి ఫిజీషియన్స్(ఐఐహెచ్‌పీ) నిజామాబాద్ చాప్టర్ నూతన కార్యవర్గాన్ని నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి వైద్యులతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జిల్లా కేంద్రానికి చెందిన వైద్యుడు క్రిష్ణమూర్తి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా సుబ్బారావు, ప్రవీన్‌కుమార్, రాంప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా కులకర్ణి, సహాయ కార్యదర్శులుగా చిలుక శ్రీనివాస్, ఇందిరామోహన్, కోశాధికారిగా మహేశ్‌కుమార్, మహిళా సభ్యులుగా పద్మజ, పద్మావతి, సృజన, ప్రనద్విత, సలహాదారులుగా గోపీకృష్ణ, రాజశేఖర్‌రెడ్డి, రాజశేఖర్, కార్యవర్గ సభ్యులుగా రవీందర్, రుద్రశ్రీనివాస్, క్రాంతికుమార్, రజనీకాంత్‌లను ఎన్నుకున్నారు.
‘హలో లంబాడీ.. చలో హైదరాబాద్’ను
జయప్రదం చేయాలి
కామారెడ్డి టౌన్: లంబాడీల ఆత్మగౌరవ వేదిక ఆధ్వర్యంలో ఈనెల 19న నిర్వహించే హలో లంబాడీ.. చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని లంబాడీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ నాయక్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ఆత్మగౌరవ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలో వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రచార కార్యదర్శి రవీందర్ నాయక్, నాయకులు అర్జున్, సర్దార్, శంకర్, నవీన్, సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు.

ఐఐహెచ్‌పీ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక