
వివాహిత అదృశ్యం
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని మాల్తుమ్మెద గ్రామానికి చెందిన ఓ వివాహిత అదృశ్యమైనట్లు ఎస్సై భార్గవ్‌గౌడ్ తెలిపారు. మండలంలోని మాల్తుమ్మెద గ్రామానికి చెందిన కర్రె రవికి, నాగిరెడ్డిపేటలకు చెందిన యువతితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉ న్నారు. భార్యాభర్తలు పిల్లలతో కలిసి గతేడాది జీవనోపాధి కోసం హైదరాబాద్ వెళ్లారు. అక్కడ దంపతుల మధ్య విబేధాలు తలెత్తడంతో భార్య బంధువుల ఇంటికి వెళ్లిపోయింది. నాగిరెడ్డిపేటలోని తన తల్లిగారింట్లో గత నెల 16న నిద్రించిన సదరు వివాహిత మరుసటి రోజు నుంచి అదృశ్యమైంది. ఇప్పటికీ ఆమె ఆచూకీ లభించకపోవడంతో వివాహిత తల్లి శనివారం నాగిరెడ్డిపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు వివాహిత అదృశ్యంపై కేసున మోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సైపేర్కొన్నారు.
కామారెడ్డి క్రైం: ఆడుకుంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లి తప్పిపోయిన చిన్నారిని పట్టణ పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించిన ఘటన జిల్లా కేంద్రంలోచోటు చేసుకుంది. వివరాలు ఇలా.. బీడీ వర్కర్స్ కాలనీకి చెందిన విభూతి దివ్య–రమేష్ దంపతులకు 4 ఏళ్ల కుమార్తె పల్లవి ఉంది. చిన్నారి శనివారం సాయంత్రం ఆడుకుంటూ బయటకు వెళ్లి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందిరానగర్ కాలనీ వద్ద స్థానికులు గమనించి చిన్నారిని పోలీసులకు అప్పగించారు. పట్టణ ఎస్‌హెచ్‌వో నరహరి చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. వారు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.