
పారిశుద్ధ్య పనులు చేపట్టాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని 41 గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఎంపీడీవో నరేశ్ సూచించారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో కార్యాలయంలో కార్యదర్శుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. భారీ వర్షాల నేపథ్యంలో మురికి కాల్వలు, వీధుల్లో రోడ్లపై మురికి నీరు నిల్వకుండా, చెత్తా చెదారం వీధుల్లో లేకుండా చూడాలన్నారు. అలాగే సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎంపీవో మలహరి, ఆయా గ్రామాల కార్యదర్శులు పాల్గొన్నారు.
భిక్కనూరు: ఆర్యసమాజ్‌మందిరం వ్యవస్థాకుడు గువ్వ బుచ్చయ్య మరణం ఆధ్యాత్మికతకు తీరని లోటు అని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, పీసీసీ కార్యదర్శి ఇంద్రకరణ్‌రెడ్డిలు అన్నారు. శనివారం వారు భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామానికి వెళ్లి ఇటీవల మృతి చెందన విండో మాజీ చైర్మన్ గువ్వ బుచ్చయ్య కుటుంబాన్ని పరమార్శించారు. బ్రహ్మజ్ఞాన ఆశ్రమం, శ్రీకృష్ణమందిరం నిర్మాణానికి బుచ్చయ్య ఎంతగానో శ్రమించాడని కొనియాడారు. కాంగ్రెస్ నేతలు బల్యాల సుధర్శన్, అందే దయాకర్‌రెడ్డి, కల్లురి సిద్దరాములు, లింబాద్రి,నరేష్ ,మూర్తి, ప్రకాశ్, సిద్దరాములు తదితరులు ఉన్నారు.
భిక్కనూరు: మండలంలో కురుస్తున్న వర్షాలకు పురాతన ఇళ్లు కూలిపోతున్నాయని అందులో నివసిస్తు ప్రజలను అధికారులు అప్రమత్తం చేయాలని భిక్కనూరు మండల బీఆర్‌ఎస్ మహిళ విభాగం అధ్యక్షురాలు దేవర లక్ష్మి అన్నారు. శనివారం ఆమె భిక్కనూరులో విలేకరులతో మాట్లాడుతూ మండలంలో ఇటీవల గోడ కూలి జాగిరిసింగ్ మృతి చెందడంతో ఆయన కుటుంబం వీధిన పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలకు నష్టపోయిన వారిని పార్టీలకతీతంగా అన్ని పార్టీల వారు ముందుకు వచ్చి ఆదుకోవాలన్నారు.
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మండలంలోని పలు గ్రామాలలో శనివారం మత్తమాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది హెల్త్ క్యాంపులు నిర్వహించారు. మండలంలోని దావల్‌మల్కపల్లి, మల్లయ్యపల్లి గ్రామాలలో ఆరోగ్య సిబ్బంది ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులను అందించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శరత్, ఆరోగ్య సిబ్బంది తదితరులున్నారు.

పారిశుద్ధ్య పనులు చేపట్టాలి