లోక్‌ అదాలత్‌లో భారీగా కేసుల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

లోక్‌ అదాలత్‌లో భారీగా కేసుల పరిష్కారం

Sep 14 2025 3:27 AM | Updated on Sep 14 2025 3:27 AM

లోక్‌

లోక్‌ అదాలత్‌లో భారీగా కేసుల పరిష్కారం

బిచ్కుంద(జుక్కల్‌): బిచ్కుంద కోర్టులో న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం లోక్‌ అదాలత్‌ కార్యక్రమం నిర్వహించారు. బిచ్కుంద కోర్టు న్యాయమూర్తి వినీల్‌ కుమార్‌ ఇరువర్గాల కక్షదారులకు మాట్లాడి లోక్‌ అదాలత్‌ కింద కేసులు పరిష్కరించారు. ఈ లోక్‌ అదాలత్‌లో 356 కేసుల పరిష్కరంకాగా, డ్రంక్‌ డ్రైవ్‌, సెటిల్మెంట్‌ ద్వారా రూ.23,67,360 రికవరీ చేశారు. న్యాయవాదులు లక్ష్మణరావు, మల్లేశ్వర్‌, విఠల్‌రావు, ప్రకాష్‌, విఠల్‌, బిచ్కుంద ఎస్సై మోహన్‌రెడ్డి, మద్నూర్‌ ఎస్సై విజయ్‌కొండ పాల్గొన్నారు.

ఎల్లారెడ్డి మున్సిఫ్‌ కోర్టులో ..

ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిఫ్‌ కోర్టులో జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమాన్ని మున్సిఫ్‌ కోర్టు న్యాయమూర్తి సుష్మ నిర్వహించారు. ఈ లోక్‌ అదాలత్‌లో 441 కేసుల పరిష్కరంకాగా, సెటిల్మెంట్‌ ద్వారా రూ.13,98,145 రికవరీ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు గోపాల్‌రావు, పండరి, శ్రీనివాస్‌, నవీద్‌, సాయిప్రకాష్‌ , శ్రీకాంత్‌, సాయిబాబా, సతీ ష్‌, ఎకై ్సజ్‌సీఐ షాకీర్‌ అహ్మద్‌ తదితరులున్నారు.

బాన్సువాడ కోర్టులో..

బాన్సువాడ రూరల్‌: లోక్‌ అదాలత్‌తో కేసులు సత్వర పరిష్కారం అవుతాయని బాన్సువాడ సివిల్‌కోర్టు న్యాయమూర్తి టీఎస్‌పీ భార్గవి అన్నారు. కోర్టు ఆవరణలో లోక్‌ అదాలత్‌ నిర్వహించి మాట్లాడారు. ఈ లోక్‌ అదాలత్‌లో 300 కేసుల పరిష్కరంకాగా, సెటిల్మెంట్‌ ద్వారా రూ.16,23, 222 రికవరీ చేశారు.ఈకార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ ప్రసిడెంట్‌ మోహన్‌రెడ్డి, న్యాయవాదులు ఖలీల్‌, దత్తాత్రేయ, మోగులయ్య, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

లోక్‌ అదాలత్‌లో భారీగా కేసుల పరిష్కారం 1
1/2

లోక్‌ అదాలత్‌లో భారీగా కేసుల పరిష్కారం

లోక్‌ అదాలత్‌లో భారీగా కేసుల పరిష్కారం 2
2/2

లోక్‌ అదాలత్‌లో భారీగా కేసుల పరిష్కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement