
ఆటోలు చోరీ చేసే ముఠా అరెస్ట్
కామారెడ్డి క్రైం: ఆటోల చోరీలకు పాల్పడుతున్న ఓ ముఠాను నాగిరెడ్డిపేట పోలీసులు అరెస్ట్ చేసి రి మాండ్‌కు తరలించారు. జిల్లాకేంద్రంలోని జిల్లా పో లీసు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన వి లేకరుల సమావేశంలో ఎస్పీ రాజేశ్ చంద్ర వివరా లు వెల్లడించారు. నాగిరెడ్డిపేట మండలం గోపాల్‌పేటకు చెందిన తాడేపల్లి క్రిష్ణ ఆటో ఈ నెల 11న చోరీకి గురైంది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించా రు. శనివారం ఉదయం మాల్తుమ్మెద వద్ద పోలీసు లు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఆటోలో పారిపోబోయిన ఇద్దరిని పట్టుకుని విచారించారు. దీంతో ఆటోల చోరీ వ్యవహారం బయటపడింది. నిందితులను నిజామాబాద్ జిల్లా మంచిప్పకు చెందిన కుమ్మరి రాజు, కొల్ల దుర్గరాజులుగా గుర్తించా రు. వారిలో కుమ్మరి రాజుపై గతంలో కరీంనగర్, జ గిత్యాల, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలో మొత్తం 20 దొంగతనం కేసులు ఉన్నాయ ని ఎస్పీ తెలిపారు. వాటిలో ఎక్కువగా ఆటోల చోరీ కేసులే ఉన్నాయన్నారు. దుర్గరాజుపై గతంలో ఒక ఆటో చోరీ కేసు ఉన్నట్లు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి నాగిరెడ్డిపేటలో దొంగిలించిన ఆటోతోపాటు మెదక్ జిల్లాలో దొంగిలించిన 2 ఆటోలు, భి క్కనూర్‌లో ఎత్తుకెళ్లిన మరో ఆటోను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నామని ఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకున్న కానిస్టేబుల్ గంగారాం, హోంగార్డు బాలాజీలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.