
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
మద్నూర్(జుక్కల్): కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జీ మంథని సామ్యెల్ డిమాండ్ చేశారు. డోంగ్లీ మండల కేంద్రంలో శనివారం ఆయన ఎమ్మార్పీఎస్ నా యకులతో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలు గడుస్తున్నా .. దివ్యాంగులకు రూ. 6 వేల పింఛన్, వృద్ధులు, వితంతువులు చేయూత పెన్షన్‌దారులకు రూ.4 వేల పింఛన్‌ను ఇవ్వడంలేదని విమర్శించారు. 15న దివ్యాంగుల పెన్షన్‌దారులతో తహసీల్ కార్యలయాన్ని ముట్టడిస్తామన్నారు. ఈ నెల 14న సరిహద్దులోని దేగ్లూర్‌కు మందకృష్ణ మాదిగ వస్తున్నారని ఆయన తెలిపారు.నాయకులు పెద్దబూరి గంగారం, మండల అధ్యక్షుడు, మారుతి, హన్మంత్, రాహుల్, శివాజీ, చందు, భీంరావ్, అరవింద్, తుకారం తదితరులు పాల్గొన్నారు.
తహసీల్దార్ కార్యాలయం ముట్టడిని
విజయవంతం చేయాలి
రాజంపేట: రాష్ట్ర ఎమ్మార్పీస్ ఆదేశాల మేరకు ఈ నెల 15న నిర్వహించే తహసీల్దార్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీస్ జిల్లా అధ్యక్షులు సట్టిగారి లక్ష్మి డిమాండ్ చేశారు. శనివారం రాజంపేట మండల కేంద్రంలోని స్థానిక పెద్దమ్మ ఆలయ ప్రాంగణంలో దివ్యాంగుల హక్కుల పొరాట సమితి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కార్యక్రమంలో వీహెచ్‌పీఎస్ మండల అధ్యక్షులు జి. రాజు, భాస్కర్, నరేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి