యూరియా గోస తీరేది ఎప్పుడో? | - | Sakshi
Sakshi News home page

యూరియా గోస తీరేది ఎప్పుడో?

Sep 14 2025 3:17 AM | Updated on Sep 14 2025 3:17 AM

యూరియ

యూరియా గోస తీరేది ఎప్పుడో?

యూరియా తెప్పించాలి

రెండే దొరికాయి

బీబీపేట : రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. వారాల తరబడి సమస్య కొనసాగుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. దీంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. బీబీపేట సొసైటీకి 662 బస్తాల యూరియా వచ్చిందని తెలియగానే శుక్రవారం రాత్రే రైతులు తరలివచ్చి బారులు తీరారు. శనివారం ఉదయం వరకు వెయ్యి మందికిపైనే క్యూలో ఉన్నారు. సొసైటీ సిబ్బంది, వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు సొసైటీ వద్దకు చేరుకొని ఎస్సై ప్రభాకర్‌ ఆధ్వర్యంలో టోకెన్ల పంపిణీని ప్రారంభించారు. ఈ క్రమంలో రైతుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులనూ తోసేశారు. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తి ఇటుక రాయిని కానిస్టేబుల్‌ నవీన్‌పైకి విసరడంతో అతడికి ఛాతీలో దెబ్బ తగిలింది. వెంటనే అతడిని పక్కనే ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీంతో ఎస్సై పరిస్థితి చేయి దాటడంతో టోకెన్ల పంపిణీ ఆపేసి పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. అక్కడికి చేరుకున్న రైతులు టోకెన్లను ఇవ్వాలని పట్టుబట్టడంతో అధికారులతో చర్చించి వరుస క్రమంలో రైతులను కూర్చోబెట్టారు. సొసైటీ వద్ద ఇచ్చిన టోకెన్లను రద్దు చేసి కొత్తవాటిని తయారు చేశారు. గంటల తరబడి వేచి చూడాల్సి రావడంతో రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దోమకొండ పోలీసులతో పాటు సీఐ సంపత్‌ సైతం అక్కడకు చేరుకొని వారిని సముదాయించి, ఒక్కో రైతుకు ఒక టోకెన్‌ ఇచ్చారు. ఈ క్రమంలో మల్కాపూర్‌ గ్రామానికి చెందిన గట్క రేఖయ్య అనే రైతుకు ఫిట్స్‌ రావడంతో అక్కడే ఉన్న రైతులు స్పందించి అతనికి సహాయం అందించారు. అతడిని పోలీసు వాహనంలో ఆస్పత్రికి తరలించారు. సొసైటీ వద్ద కూడా బారెడు రైతులు ఉండడంతో రైతులకు పొద్దంతా బస్తా యూరియా సంపాదించడంలోనే గడిచిపోయింది. మొత్తం వెయ్యి మంది రాగా శనివారం 662 టోకెన్లు ఇచ్చిన అధికారులు.. సోమవారం కోసం మిగిలినవారికి టోకెన్లు అందించారు.

సొసైటీ వద్ద బారులు తీరిన రైతులు

టోకెన్ల కోసం పోలీస్‌ స్టేషన్‌ వద్ద వరుసలో కూర్చున్న రైతులు

వరి పంటకు అసలు టైంలో యూరియా చల్లితేనే మంచి దిగుబడి వస్తుంది. కానీ ఎరువు దొరక్కపోవడంతో పంటకు వేయలేకపోతున్నాం. లేటుగా వేస్తే లాభం ఉండదు. ప్రభుత్వం స్పందించి అవసరమైన మేర యూరియాను తెప్పించాలి. – బోయినపురం రమేశ్‌, సీతారాంపల్లి

యూరియా కోసం రాత్రి వచ్చి ఇక్కడే పడుకున్నాను. రోజంతా ఉన్నా ఒకే బస్తా దొరికింది. నాలుగు ఎకరా ల్లో నాట్లు వేస్తే ఇప్పటివరకు రెండు బస్తాలు మాత్రమే దొరికాయి. ఎరువు వేయకపోవడంతో ఈసారి పంట దిగుబడులు వచ్చేలా లేవు. – పిట్ల స్వామి, రైతు, మల్కాపూర్‌

వీరంతా నేరస్తులు కాదు.. ఏ కేసుతోనూ సంబంధం లేదు.. యూరియా బస్తా కోసం రోజుల తరబడి సొసైటీ చుట్టూ తిరుగుతున్న అన్నదాతలు.. బీబీపేట సొసైటీలో బస్తాలు తక్కువగా ఉండడం.. ఎక్కువమంది రైతులు తరలిరావడం.. టోకెన్ల పంపిణీ సందర్భంగా తోపులాట జరగడం.. గుర్తు తెలియని వ్యక్తి పోలీసుపై రాళ్లు విసరడం.. దీంతో పరిస్థితి చేయి దాటుతోందని భావించిన పోలీసులు అందరినీ పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి ఇలా ఎండలో వరుసలో కూర్చోబెట్టి టోకెన్లు పంపిణీ చేశారు.

రోజూ సొసైటీల వద్దకు వస్తున్న రైతులు

టోకెన్ల పంపిణీపై అసహనం..

రాళ్ల దాడి చేసిన గుర్తుతెలియని వ్యక్తి

కానిస్టేబుల్‌కు గాయాలు

పోలీసు స్టేషన్‌ వద్ద టోకెన్లను

పంపిణీ చేసిన పోలీసులు

యూరియా గోస తీరేది ఎప్పుడో?1
1/4

యూరియా గోస తీరేది ఎప్పుడో?

యూరియా గోస తీరేది ఎప్పుడో?2
2/4

యూరియా గోస తీరేది ఎప్పుడో?

యూరియా గోస తీరేది ఎప్పుడో?3
3/4

యూరియా గోస తీరేది ఎప్పుడో?

యూరియా గోస తీరేది ఎప్పుడో?4
4/4

యూరియా గోస తీరేది ఎప్పుడో?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement