
రాష్ట్రస్థాయి పోటీల్లో చాంపియన్‌గా గాంధారి ఈఎంఆర్‌ఎస్
కొత్తగూడ: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి ఈఎంఆర్‌ఎస్‌లో జరిగిన రాష్ట్రస్థాయి క్రీడల్లో కామారెడ్డి జిల్లా గాంధారి ఈఎంఆర్‌ఎస్ ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. శనివారం క్రీడల ముగింపు వేడుకలు నిర్వహించగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హాజరై, మాట్లాడారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓడిన వారు నిరాశపడకుండా గెలుపుకోసం మరోసారి ప్రయత్నించాలనిన్నారు. అనంతరం ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించిన గాంధారి ఈఎంఆర్‌ఎస్‌కు, అలాగే వివిధ విభాగాల్లో గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేశారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాఽథ్‌కేకన్, ఆర్డీవో కృష్ణవేణి, స్పోర్ట్స్ ఆఫీసర్ వీర్యనాయక్, ఆర్సీవో రత్నకుమారి, రాష్ట్ర ఉపాధిహామీ సంస్థ డైరెక్టర్ చల్ల నారాయణరెడ్డి, ప్రిన్సిపాల్ అజయ్‌సింగ్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.