
వరద బాధితులకు రిలీఫ్ కిట్ల పంపిణీ
కామారెడ్డి రూరల్: కామారెడ్డి పట్టణంలోని వరద బాధిత కుటుంబాలకు సోమవారం కామారెడ్డి పట్టణంలోని ఈఎస్‌ఆర్ గార్డెన్‌న్‌లో రామకృష్ణ మఠ్, ఇన్ఫోసిస్ సహకారంతో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ చేతుల మీదుగా 334 రిలీఫ్ కిట్‌లను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మునుపెన్నడూ లేని విధంగా వరదలు సంభవించి తీవ్ర నష్టం కలిగిందన్నారు. వరద బాధితుల కుటుంబాలను ఆదుకునేందుకు రామకృష్ణ మఠ్ ముందుకు వచ్చి ఇప్పటికే వైద్య శిబిరాలు నిర్వహిందని తెలిపారు. అదేవిధంగా ఈ నెల 9న మంగళవారం ఎల్లారెడ్డిలో వరద బాధిత కుటుంబాలకు 150 కిట్లను, బాన్సువాడలో 150 కిట్లను ఇన్ఫోసిస్, రామకృష్ణ మఠ్ సహకారంతో అందిస్తామన్నారు. మొత్తం కిట్ల విలువ రూ. 20 లక్షలు. మరింత మంది దాతలు ముందుకు వచ్చి వరద బాధితులను ఆదుకోవాలని కోరారు.