
ముంపు బాధ తప్పించండి
డ్రైనేజీలు సక్రమంగా లేక వరదలు వచ్చినప్పుడు తమ కాలనీ ముంపునకు గురవుతున్నదని.. జిల్లా కేంద్రంలోని దేవి విహార్ హౌసింగ్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తమ కాలనీలోకి పై ప్రాంతాల నుంచి భారీ వరద నీరు వచ్చిందన్నారు. వరద నీరు బయటకు వెళ్లే దారి లేక కాలనీలోని ఇళ్లు నీట మునిగాయన్నారు. కాలనీ వద్ద ప్రధాన రహదారి వెంబడి ఉన్న మురికి కాలువలు చిన్నవిగా ఉండటంతో ప్రవాహం తక్కువగా ఉండి ముంపునకు గురవుతున్నామని వాపోయారు. నిజాంసాగర్ రోడ్డుపై రెండు చోట్ల పెద్ద సైజులో కల్వర్టులు, రోడ్డుకు ఇరువైపులా పెద్ద సైజులో డ్రైనేజీ వ్వవస్థను నిర్మించి కాలనీని కాపాడాలని విన్నవించారు.