
మొరం అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి
ఇష్టారాజ్యంగా మొరం తవ్వకాలు జరుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీర్కూర్ మండలం భైరాపూర్ గ్రామస్తులు కలెక్టరేట్‌కు తరలివచ్చారు. వారు మాట్లాడుతూ.. గ్రామ శివారులోని సర్వే నెంబరు 30 లో చిన్న, పెద్ద గుట్టలు ఉన్నాయని తెలిపారు. వాటిలో కొందరు ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమంగా మొరం తవ్వకాలు చేపడుతున్నారని తెలిపారు. మరికొందరు తమకు ఈ సర్వే నెంబర్‌లో పట్టా భుములు ఉన్నాయని చెబుతూ యథేచ్ఛగా మొరం అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించారు. ఆ స్థలాన్ని క్రమబద్దీకరించి గ్రామస్తులు వడ్లు ఆరబెట్టుకునేందుకు, పశువుల మేతకు కేటాయించాలని కోరారు. ఈ మేరకు ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు.