
పిప్రిలో గౌడ కులస్తుల బహిష్కరణ
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో గౌడ కులస్తులపై గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు బహిష్కరణ వేటు వేశారు. కల్లు ధర పెంపు విషయంలో గ్రామానికి చెందిన తమను వీడీసీ బహిష్కరించినట్లు సోమవారం 54 గౌడ కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ప్రస్తుతం ఉన్న ధర సరిపోవడం లేదని, ధర పెంచుకుంటామని వీడీసీ దృష్టికి తీసుకెళ్లగా, తెల్లకాగితంపై సంతకాలు పెట్టి ఇవ్వాలని లేదంటే తాము చెప్పినట్లు వినాలని హకుం జారీ చేసినట్లు తెలిపారు. తెల్లకాగితంపై సంతకాలు చేయకపోవడంతో తమను బహిష్కరించినట్లు పేర్కొన్నారు. తమకు సంబంఽధించిన హోటళ్లు, దుకాణాలు, ఆటోల్లోకి ఎవరినీ రానివ్వకుండా ఆంక్షలు పెట్టినట్లు గౌడ కులస్తులు తెలిపారు.