
ఎన్నికల హామీలను నెరవేర్చాలి
ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చాల ని డిమాండ్ చేస్తూ వికలాంగుల హక్కుల పోరా ట సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. సమితి జిల్లా ప్రతినిధులు మాట్లాడుతూ..ఎన్నికల సమయంలో దివ్యాంగులకు రూ. 6 వేలు,తీవ్ర వైకల్యం కలిగిన వారికి రూ.15 వేలు పింఛన్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పాటై 20 నెల లు కావస్తున్నా పింఛన్‌ను పెంచడం లేదన్నారు. తమ గోడు వినేందుకు కలెక్టర్ రావాలని పట్టుబట్టి దాదాపు గంటపాటు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు.ఆర్డీవో వీణ, డీఆర్‌డీవో సురేందర్, జిల్లా సంక్షే అధికారిణి ప్రమీల వారి వద్దకు వచ్చి సముదాయించారు. ప్రజావాణి ముగించు కుని బయటకు వస్తున్న కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ వారిని చూసి ఆగారు. దివ్యాంగులతో మాట్లాడి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. దీంతో వారు వెనుదిరిగారు.