
బస్సు ఢీకొని ఒకరు..
ఖలీల్‌వాడి: నగరంలోని కంఠేశ్వర్ ప్రాంతంలో సోమ వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు. వి వరాలు ఇలా ఉన్నాయి. ఆగ్రాకు చెందిన సంతోష్(32) సోమవారం బైక్‌పై ఆర్మూర్ వైపు నుంచి నిజామాబాద్‌కు వస్తున్నాడు. కంఠేశ్వర్‌లోని అయ్య ప్ప స్వామి ఆలయ సమీపంలో ముందున్న ఓ స్కూల్ బస్సును బైక్ ఢీకొట్టింది. ఆ వెంటనే వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న సంతోష్ తలకు తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే సంతోష్ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.