
కనువిప్పు కలిగిస్తాం
రేవంత్‌రెడ్డి సారథ్యంలో బీసీలకు న్యాయం
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేందుకు కామారెడ్డిలో ఈనెల 15న నిర్వహించే సభను విజయవంతం చేయాలని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని కన్వెన్షన్ సెంటర్‌లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బడుగు, బలహీన వర్గాల పార్టీ అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసి తీరుతామన్నారు. బీస్థానిక సంస్థల ఎన్నికల్లోనే కాకుండా విద్య, ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్ల అమలు కోసం తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దానికి చట్టబద్ధత ఇవ్వాల్సిన కేంద్రం మోకాలడ్డుతోందని ఆరోపించారు. బీసీ బిల్లును ఆపుతున్న వారి భరతం పట్టడానికి 15న కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో రెండు లక్షల మందితో సభ నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఈ రోజు మోదీని పట్టుకుని బీసీ బిల్లును ఆపగలుగుతున్నారని, రాహుల్ గాంధీ ప్రధాని అవగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని స్పష్టం చేశారు.
అందరూ కృషి చేయాలి
కామారెడ్డిలో నిర్వహించే బహిరంగ సభకు భారీ ఎత్తున జనం తరలివచ్చేలా పార్టీ నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. రాష్ట్రంలో కులగణన శాసీ్త్రయంగా జరిగిందన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కారుకూతలు కూసినా, ఎన్ని కుట్రలు చేసినా చిత్తశుద్ధితో బీసీ బిల్లు తీర్మానం చేశామన్నారు.
నిజాయితీగా బిల్లును
ఆమోదించాం
ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి ఉద్దేశించిన బిల్లును నిజాయితీగా ఆమోదించామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి పంపిన బిల్లును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. సామాజిక న్యాయం జరగాలనే ఉద్దేశంతో పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.
ఇచ్చిన మాట ప్ర కారం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసి తీ రుతామని రవాణా, బీసీ వెల్ఫేర్ శాఖల మంత్రి పొ న్నం ప్రభాకర్ పేర్కొన్నారు. బీసీ బిల్లుకు కేంద్రం చట్టబద్ధత కల్పించాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ డిమాండ్ చేశారు. బీసీలు పెద్ద సంఖ్యలో సభకు తరలివచ్చి ఐ క్యత చాటాల్సిన అవసరం ఉందని పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, కార్పొరేషన్ల చైర్మన్లు మానాల మోహన్‌రెడ్డి, ఈరవత్రి అనిల్, తాహెర్‌బిన్ హందాన్, కాసుల బాల్‌రాజ్, డీసీసీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, ఆకుల లలిత, నాయకులు అరికెల నర్సారెడ్డి, చంద్రకాంత్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, ఇందుప్రియ, ఇంద్రకరణ్‌రెడ్డి, నర్సింగరావు, విజయ్‌కుమార్‌రెడ్డి, మామిండ్ల అంజయ్య, మోహన్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, పండ్ల రాజు, గూడెం శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం బీసీలకు న్యాయం చేస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ పేర్కొన్నారు. కామారెడ్డిలోనే బీసీ డిక్లరేషన్ ప్రకటించారన్నారు. బీసీ బిల్లును ఆమోదించిన తర్వాత కామారెడ్డిలోనే సభ నిర్వహించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యేలు మదన్‌మోహన్‌రావు, లక్ష్మీకాంతారావు, సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి, ఆది శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు.
కామారెడ్డిలో రెండు లక్షల
మందితో సభ నిర్వహిస్తాం
కేంద్రంపై సమర శంఖం పూరిస్తాం
బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత
సాధించడమే లక్ష్యం
మోదీ ఇవ్వకపోతే రాహుల్
ప్రధాని కాగానే అమలు చేస్తాం
పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్

కనువిప్పు కలిగిస్తాం