
శాశ్వత పరిష్కారం చూపాలి
కామారెడ్డిలో వరదలకు లోతట్టు కాలనీలో మునిగిపోయి ఇబ్బందులతో ఉన్నప్పుడు ప్రజలకు ఆదుకునేందుకు రాజకీయాలకు అతీతంగా నేతలు, అన్ని శాఖల అధికారులు వర్షాల్లో తడుస్తూ 48 గంటల పాటు విధులు నిర్వహించి ప్రజలు ఇబ్బందులను తొలగించేందుకు తీవ్రంగా కష్టపడ్డారు. వారందరికి కృతజ్ఞతలు. కామారెడ్డి ప్రజలకు ఆత్మస్థైర్యం నింపేందుకు వచ్చిన సీఎంకు కృతజ్ఞతలు. మళ్లీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా శాశ్వత పరిష్కారం చూపాలని సీఎంను విజ్ఞప్తి చేస్తున్నా. అవసరమైన నిధులు మంజూరు చేయాలి.
– వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్యే