
విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలి
● చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి ● మంత్రులు పొన్నం, వాకిటి
భిక్కనూరు: మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంతి పొన్నం ప్రభాకర్, క్రీడలు, పశుసంవర్ధక శాఖల మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. ఆదివారం వారు జంగంపల్లిలోని బీసీ గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్నతనంలోనే లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకు సాగితే భవిష్యత్తు బంగారుమయం అవుతుందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. పాఠశాలను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, విధిగా మెనూ అమలు చేయాలని సూచించారు. విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలోని సమస్యలు, విద్యాబోధన గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీలత పాల్గొన్నారు.