
‘నాణ్యమైన ఆహార ఉత్పత్తులు అందించాలి’
కామారెడ్డి రూరల్: హోటల్ వ్యాపార నిర్వాహకులు, దుకాణాల యజమానులు వినియోగదారులకు నాణ్యమైన ఆహార ఉత్పత్తులు అందించాలని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) శిక్షకురాలు భార్గవి కంచాల సూచించారు. మహారాష్ట్ర సెంటర్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్(ఎంసీఈడీ) ఆధ్వర్యంలో ఆదివారం కామారెడ్డి పట్టణంలోని వశిష్ట డిగ్రీ కాలేజీలో దుకాణదారులు, హోటల్ వ్యాపార నిర్వాహకులకు శిక్షణ ఇచ్చారు. శుచి, శుభ్రత తప్పనిసరిగా పాటించాలన్నారు. ఆహార పదార్థాలలో ఫుడ్ కలర్స్, టెస్టింగ్ సాల్ట్ వినియోగించరాదన్నారు. కార్యక్రమంలో ఎంసీఈడీ రీజినల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, కామారెడ్డి జిల్లా కోఆర్డినేటర్ కొప్పుల రవి, సిబ్బంది దేవరాజ్, నవీన్, కృష్ణ, అనిల్, సతీష్, అనిల్, పలువురు దుకాణదారులు పాల్గొన్నారు.