
ప్రాజెక్టు అద్భుతం
నిజాంసాగర్: నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మించి వందేళ్లయినా ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉందని, ఇది అద్భుతమని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎగువ నుంచి వరద ఉధృతంగా వస్తున్నా, ప్రాజెక్టు నుంచి ఆటోమెటిక్ సిస్టమ్ లేకున్నా, మ్యాన్‌వల్‌గా నీటిని విడుదల చేస్తున్న నీటిపారుదలశాఖ అధికారులు, సిబ్బంది పనితీరును ఆయన అభినందించారు. ఎమ్మెల్యే వెంట నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి దంపతులు, నాయకులు ఉన్నారు.

ప్రాజెక్టు అద్భుతం