
మాది ప్రజా ప్రభుత్వం
కామారెడ్డి టౌన్: మాది ప్రజా ప్రభుత్వమని, వరదల రోజున అనివార్య కారణాలతో సీఎం రాలేకపోయారని, పట్టు వదలకుండా మళ్లీ కామారెడ్డికి వచ్చి నేరుగా ప్రజల బాధలు తెలుసుకుని సహాయం చేయడానికి వచ్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని మంత్రి సీతక్క అన్నారు. జిల్లాకేంద్రంలో ఇటీవల వరద ముంపునకు గురైన జీఆర్ కాలనీలో సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి ఆమె గురువారం పర్యటించారు. బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆమె మా ట్లాడుతూ.. కాంగ్రెస్ అంటే ప్రజాపాలన ప్రభుత్వం, వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు మేమంతా ముందుంటామన్నారు. వరదలు వచ్చిన మరుసటి రోజునే ఎంపీ షెట్కార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీలతో ఇక్కడ బాధితుల బాధలను తెలుసుకుని సీఎం గారికి వివరించామన్నారు.