
ఎరువు కోసం జాగారం
రామారెడ్డి: రామారెడ్డికి గురువారం యూరి యా వస్తుందన్న సమాచారం తెలియడంతో రైతులు బుధవారం రాత్రే రైతు వేదిక వద్దకు చేరుకున్నారు. దుప్పట్లు, చద్దర్లు తెచ్చుకుని వేదిక ఆవరణలో నిరీక్షిస్తున్నారు. రాత్రంతా జాగారం చేసినా ఒక్క బస్తా అయినా దొరుకుతుందో లేదోనని నాగరాజు అనే రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఉన్నతాధికారులు స్పందించి సరిపడా ఎరువులు పంపించాలని కోరాడు.
గతంలో క్యూలైన్‌లో ఓ రైతు మృతి..
2011లో యూరియా కొరత ఏర్పడింది. అప్ప ట్లో రైతులు బారులు తీరారు. రామారెడ్డికి చెందిన ఊషయ్య అనే రైతు క్యూలైన్‌లో అనారోగ్యానికి గురై మరణించాడు. ఆ పరిస్థితి తలెత్తకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.