
దివ్యాంగులను విస్మరిస్తే పోరాటం తప్పదు
కామారెడ్డి టౌన్: దివ్యాంగులను విస్మరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం తప్పదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని లక్ష్మీదేవి గార్డెన్‌లో వికలాంగుల హక్కుల పోరాట సమితి(వీహెచ్‌పీఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగుల మరో గర్జన సన్నాహక సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికలలో దివ్యాంగులకు ప్రభుత్వం ఇచ్చిన రూ.6 వేల పెన్షన్ హామీని తక్షణమే అమలు చేయాలని, లేకుంటే ప్రభుత్వం మెడలు వంచైనా సాధించుకుంటామన్నారు. హామీ ఇచ్చి 20 నెలలు గడుస్తున్నా అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 13న హైదరాబాద్‌లో జరిగే దివ్యాంగుల మహాగర్జనకు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వీహెచ్‌పీఎస్ జాతీయ అధ్యక్షులు సుజాత సూర్యవంశీ, జిల్లా అధ్యక్షుడు కోలా బాల్‌రాజ్‌గౌడ్, రాజ్యలక్ష్మి, అఫిజా, మంగమ్మ, దశరథం, యాదగిరి పాల్గొన్నారు.
తక్షణమే రూ.6 వేల పెన్షన్
హామీ అమలు చేయాలి
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక
అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ