
32 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని గౌరారం గ్రామంలో మంగళవారం అక్రమంగా తరలిస్తున్న 32 క్వింటాళ్ల రేషన్ బియ్యంను స్వాధీనం చేసుకొని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు మంగళవారం తెలిపారు. కోటగిరి గ్రామానికి చెందిన మహమ్మద్ ఉమేర్, బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామానికి అందె మనోహర్ ఇద్దరు కలిసి మారుమూల గ్రామాల్లో రేషన్ బియ్యం కొనుగోలు చేసి బోలెరో వాహనంలో ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తుండగా, పోలీసులు నిఘా ఉంచి పట్టుకున్నారు. ఉమేర్, మనోహర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.