
నస్రుల్లాబాద్‌లో గ్రామ సభ
నస్రుల్లాబాద్: పలు గ్రామాల్లో మంగళవారం గ్రామ సభలు నిర్వహించారు. ఇందులో భాగంగా పంచాయతీ అడ్వాన్స్‌మెంట్ ఇండెక్స్(పీఏఐ) కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ పరిధిలోని అధికారుల నుంచి గ్రామీణ ప్రజల వివరాలను సేకరిస్తామని పంచాయతీ కార్యదర్శులు తెలిపారు. జీపీ కార్యదర్శి రాజే ష్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
దోమల నివారణకు
మందుల పిచికారీ
భిక్కనూరు: పెద్దమల్లారెడ్డిలో దోమల నివారణకు గ్రామ పంచాయతీ ఈవో లక్ష్మి ఆధ్వర్యంలో సిబ్బంది మంగళవారం దోమల నివారణ మందును పిచికారకీ చేశారు. ప్రతి రోజూ రాత్రి గ్రామంలో దోమల బెడద నివారణకు ఫాగింగ్ కూడా నిర్వహిస్తున్నామన్నారు.
తల్లి పాలే బిడ్డలకు సురక్షితం
పిట్లం(జుక్కల్): బిడ్డలకు తల్లి పాలే సురక్షితమని, తల్లి పాలు తాగిన శిశువులు ఆరోగ్యంగా ఉంటారని సీడీపీవో సౌభాగ్య పేర్కొన్నారు. అన్నారం అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం తల్లి పాల వారోత్సవాలను నిర్వహించారు. తల్లిపాల వారోత్సవాలలో భాగంగా సెంటర్‌లోని పిల్లల బరువు, ఎత్తు, కొలతలను పరిశీలించారు. ఈ సందర్భంగా సీడీపీవో మాట్లాడుతూ.. పుట్టిన బిడ్డకు మొదటి ఆరు నెలల పాటు తల్లి పాలు మాత్రమే ఇవ్వాలని సూచించారు. అనంతరం అనంతరం 7 నెలలు పూర్తయిన చిన్నారులకు అన్న ప్రాశన కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ సూపర్‌వైజర్ సుమలత, అంగన్వాడీ టీచర్ అనురాధ, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
చిన్నారులకు పౌష్టిక ఆహారం అందించాలి
ఎల్లారెడ్డిరూరల్: చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని ఎంపీడీవో ప్రకాష్ అన్నారు. మంగళవారం రేపల్లెవాడ అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు.
అంగన్‌వాడీ కేంద్రాల తనిఖీ
నిజాంసాగర్ (జుక్కల్): మాగి, గోర్గల్ గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలను మంగళవారం స్థానిక ఎంపీడీవో గంగాధర్ తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లో చిన్నారుల హాజరు, స్టాక్ రిజిస్టర్‌లను ఆయన పరిశీలించారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ లక్ష్మి, తదితరులున్నారు.

నస్రుల్లాబాద్‌లో గ్రామ సభ

నస్రుల్లాబాద్‌లో గ్రామ సభ

నస్రుల్లాబాద్‌లో గ్రామ సభ