
‘విద్యార్థులకు ప్రోత్సాహకాలు అభినందనీయం’
కామారెడ్డి అర్బన్: ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారికి ప్రోత్సాహకంగా నగదుతో పాటు ప్రశంసాపత్రాలు అందజేయడం అభినందనీయమని డీఈవో ఎస్.రాజు, డీటీవో బి.వెంకటేశ్వర్లు అన్నారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతిలో ప్రతిభ చూపిన 15 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.5 వేలు చొప్పున నగదు, ప్రశంసా ప్రతాలు, రాష్ట్రస్థాయి క్రీడల్లో ప్రతిభ చూపిన వారికి క్రీడాసామగ్రి అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు నిట్టు విఠల్‌రావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి డీఈవో, డీటీవోలు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. సంఘం ప్రతినిధులు గంగా గౌడ్, ఉపేందర్, అర్జున్‌రావు, తదితరులున్నారు.