
ఐడియా అదిరెన్..!
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): కేజ్‌వీల్స్ ట్రాక్టర్లు రోడ్లపై తిరగడం వల్ల గ్రామాల్లో రోడ్లు పూర్తిగా ధ్వంసమవుతున్నాయి. ఈ క్రమంలో నాగిరెడ్డిపేట మండలకేంద్రంలో ఇటీవల నూతనంగా వేసిన జాతీయ రహదారిపై నుంచి కేజ్‌వీల్స్ ట్రాక్టర్‌ను తీసుకెళ్లాల్సి వచ్చింది. కాని కేజ్‌వీల్స్ ట్రాక్టర్‌ను జాతీయ రహదారిపై నుంచి తీసుకెళ్తే రోడ్డు ధ్వంసమవుతుందని భావించిన రైతులు వినూత్నంగా ఆలోచించారు. కేజ్‌వీల్స్ ట్రాక్టర్ వెనుకవైపు భాగాన్ని మరో ట్రాక్టర్ వెనుకవైపు గునపం సహాయంతో పైకిలేపి తరలించారు.