
‘గ్రామాల్లో గోకులాష్టమి వేడుకలు నిర్వహించాలి’
కామారెడ్డి అర్బన్: విశ్వహిందూ పరిషత్ స్థాపన దినోత్సవం సందర్భంగా గోకులాష్టమి రోజున వీహెచ్‌పీ కమిటీలున్న గ్రామాల్లో ఉత్సవాలు నిర్వహించాలని వీహెచ్‌పీ ప్రాంత సహ కార్యదర్శి చింతల వెంకన్న అన్నారు. స్థానిక ఆర్‌బీ నగర్ హన్‌మాన్ ఆలయం వద్ద ఆదివారం వీహెచ్‌పీ జిల్లా బైఠక్ నిర్వహించి వివిధ అంశాలపై చర్చించారు. జిల్లా అధ్యక్షుడు ఎ.నిత్యానందం, ఉపాధ్యక్షుడు సామల గంగారెడ్డి, ప్రతినిధులు గోపిరాజు శ్రీకాంత్‌రావు, ఊర పాపారావు, వడ్ల వెంకటస్వామి, వంగ ప్రసాద్, ఎల్లారెడ్డి, బిచ్కుంద, పిట్లం, నసురుల్లాబాద్ మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు.
పామ్ ఆయిల్ సాగుతో
అధిక లాభాలు
సదాశివనగర్(ఎల్లారెడ్డి): పామ్‌ఆయిల్ సాగుతో రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని హిందుస్థాన్ యూనిలివర్ సంస్థ ప్రతినిధులు సూచించారు. ఆదివారం అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన మాజీ సర్పంచ్ పైడి సుదర్శన్ సాగు చేసిన పామ్ ఆయిల్ తోటను పరిశీలించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు పలు రకాల సూచనలు చేశారు.
చిన్నారి చికిత్స కోసం
ఆర్థిక సహాయం
మాచారెడ్డి: పాల్వంచ మండలం సింగరాయపల్లి గ్రామానికి చెందిన బాలొల్ల రాజుకు రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని ఆదివారం కామారెడ్డి జిల్లా మాదిగ సేవా సమితి వ్యవస్థాపకుడు గంగసాని శ్రీనివాస్ అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడారు. రాజు కూతురు విలాసిని అనారోగ్యంతో కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.. ఆ చిన్నారికి రక్త కణాలు తగ్గినట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్నారి చికిత్స కోసం ఈ ఆర్థిక సహాయాన్ని అందజేశామన్నారు. సమితి సభ్యులు శంకర్, నవీన్ మల్లేష్, జగన్ పాల్గొన్నారు.

‘గ్రామాల్లో గోకులాష్టమి వేడుకలు నిర్వహించాలి’