
మత్స్యకారుల సమస్యలను పరిష్కరించండి
కామారెడ్డి టౌన్: మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్.బాలకృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సదస్సుకు అతిథిగా హాజరై మాట్లాడారు. వర్షాకాలం సీజన్ ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా ఇప్పటికి ప్రభుత్వం ఉచిత చేప, రొయ్య పిల్లల పంపిణీ విషయంలో నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. జల వనరులకు సరిపడేంత చేప, రొయ్య పిల్లలను కొనుగోలు కోసం ప్రతి మత్స్య సొసైటీల ఖాతాలో నగుదు జమ చేయాలని డిమాండ్ చేశారు. వృత్తి సంఘాల జిల్లా కన్వీనర్ వెంకట్‌గౌడ్, నాయకులు జగదీష్, బాలమణి, మోతిరాం పాల్గొన్నారు.
‘మొక్కలను దత్తత తీసుకొని రక్షించుకుందాం’
బిచ్కుంద(జుక్కల్): నాటిన మొక్కలను ప్రతిఒక్కరు దత్తత తీసుకొని రక్షించుకుందామని ఏఎంసీ చైర్మన్ కవిత పిలుపునిచ్చారు. సోమవారం మార్కెట్ యార్డు ఆవరణలో మొక్కలు నాటి మాట్లాడారు. మనం ప్రకృతిని కాపాడితే అందరు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. రైతులు పొలాల గట్లపై మొక్కలు నాటాలని కోరారు. వైస్ ఏఎంసీ చైర్మన్ శంకర్ పటేల్, సీనియర్ నాయకులు మల్లికార్జునప్ప షెట్కార్, నాగ్‌నాథ్, వెంకట్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

మత్స్యకారుల సమస్యలను పరిష్కరించండి