
ఫీజు బకాయిలు విడుదల చేయాలని ధర్నా
కామారెడ్డి టౌన్: ఫీజు బకాయిలు విడుదల చేయాలని కోరుతూ జిల్లా కేంద్రంలో ని కలెక్టరేట్ ముందు పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర సహాయ కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో పేద, మద్యతర గతి విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. విద్యార్థులు కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం పలువురిని అనుమతి ఇవ్వడంతో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. నాయకులు రాందాస్, సాయికుమార్, శ్రీకాంత్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.
9న ఓరియంటేషన్ ప్రోగ్రాం
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 9న ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించనున్నట్టు ప్రిన్సిపల్ కే.విజయ్‌కుమార్ తెలిపారు. డిగ్రీలో చేరిన కొత్త విద్యార్థులందరు తప్పనిసరిగా కార్యక్రమానికి హాజరైతే కళాశాల, అధ్యాపకులు, బోధన పద్ధతులు, పరీక్షలు పాటు అనేక ముఖ్య విషయాలు అర్థమవుతాయని ఆయన పేర్కొన్నారు.