
చెత్త రీసైక్లింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి
నిజామాబాద్ సిటీ: డంపింగ్ యార్డులో చెత్త రీసైక్లింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని ఏజెన్సీ నిర్వాహకులకు మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్ సూచించారు. నగర శివారులోని నాగారం డంపింగ్ యార్డును కమిషనర్ బుధవారం పరిశీలించారు. సిబ్బందితో పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. తడి, పొడిచెత్తను వేర్వేరుగా డంపింగ్ చే యాలని ఆదేశించారు. దుర్వాసన రాకుండా చ ర్యలు తీసుకోవాలని ఎస్సై ప్రభుదాస్‌కు సూచించా రు. తడిచెత్తతో సేంద్రియ ఎరువుల తయారీ ప్రక్రి య వేగవంతం చేయాలని, ప్యాకెట్లలో నింపి ఎరువులు సిద్ధం చేసి బయటి వ్యక్తులకు విక్రయించాలన్నారు. ఆయా జోన్ కార్యాలయాల వద్ద సేంద్రియ ఎరువుల బ్యాగ్‌లు అందుబాటులో ఉంచాలన్నారు.
నేరాల నియంత్రణకు కృషి చేయాలి
కమ్మర్‌పల్లి: గ్రామాల్లో నేరాల నియంత్రణకు పోలీసులు కృషి చేయాలని ఆర్మూర్ ఏసీపీ జె వెంకటేశ్వరరెడ్డి అన్నారు. బుధవారం కమ్మర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీఎస్‌లోని రికార్డులు, కేసు డైరీలు, నిత్య కార్యకలాపాల నమోదులను పరిశీలించారు. నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. ప్రజలతో సౌమ్యంగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం నిర్వహించిన పరేడ్‌లో పాల్గొన్నారు. భీమ్‌గల్ సీఐ పి సత్యనారాయణ, ఎస్సై జి అనిల్‌రెడ్డి ఉన్నారు.

చెత్త రీసైక్లింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి