
వ్యాధుల నియంత్రణకు ప్రచారం కల్పించాలి
బాన్సువాడ రూరల్: సీజనల్ వ్యాధుల నియంత్రణకు వైద్య, ఆరోగ్య శాఖతో పాటు స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి సూచించారు. బుధవారం ఆమె తన కార్యాలయంలో జాతీయ కీటక జనిత రోగ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా డెంగీ వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. దోమలు వృద్ధి చెందకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. కరపత్రాల ముద్రణకు సహకరించిన ఇన్సూరెన్స్ చీఫ్ అడ్వైజర్ భాగ్యవతి, బాన్సువాడ డిప్యూటీ డీఎంహెచ్‌వో విద్య, సీహెచ్‌వో దయానంద్, డాక్టర్ సమీఉల్లా, ఫార్మసిస్టు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.