
గంజాయి విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు
● 1.435 కిలోల ఎండు గంజాయి పట్టివేత
ఖలీల్‌వాడి: నగరంలోని పలు ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి బుధవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని అర్సపల్లి, ఎల్లమ్మగుట్ట, అసద్ బాలానగర్ ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో సిబ్బందితో కలిసి దాడి చేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ పేర్కొన్నారు. ఈ దాడిలో నిందితులు షేక్ పర్వేజ్, కసిలేరు మాధవ్, నజయా బేగంల నుంచి 1.435 కిలోల ఎండు గంజాయితో పాటు రెండు సెల్ ఫోన్లు, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దాడిలో ఎకై ్సజ్ కానిస్టేబుళ్లు రాజు, నారాయణ రెడ్డి, కానిస్టేబుళ్లు భోజన్న, షమీన్, శివ, సాయి, విష్ణు, అవినాష్ట మంజుల తదితరులు ఉన్నారు.