స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి | - | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి

Jul 24 2025 7:44 AM | Updated on Jul 24 2025 7:44 AM

స్థాన

స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి సూచించారు. నాగిరెడ్డిపేట మండలకేంద్రంలో బుధవారం బీజేపీ కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. మండలంలోని 10 ఎంపీటీసీ స్థానాలతోపాటు ఒక జెడ్పీటీసీ, 25 సర్పంచ్‌ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులు రాజ్‌మోహన్‌రెడ్డి, హన్మాండ్లు, నరేందర్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి భాస్కర్‌, నాయకులు దేవిసింగ్‌, కిషన్‌, నందు, వెంకట్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ సత్తా చాటాలి

మాచారెడ్డి/తాడ్వాయి(ఎల్లారెడ్డి): కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో కలసి మెలిసి పనిచేసి స్థానిక సస్థల ఎన్నికలలో బీజేపి సత్తా చాటాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల విజయ అన్నారు. తాడ్వాయి, మాచారెడ్డి, పాల్వంచ మండల కేంద్రాల్లోకార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైపల్యాలను ప్రజల దృష్టికి తేవాలన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాణాల లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి ఆంజనేయులు, మండల అధ్యక్షుడు సంతోష్‌రెడ్డి, జిల్లా నాయకులు లింగారావు, వెంకట్‌రావు, హోటల్‌శ్రీనివాస్‌, గంగారెడ్డి, సాయిరెడ్డి, నర్సారెడ్డి పాల్గొన్నారు.

అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ

బిచ్కుంద(జుక్కల్‌): జిల్లాలో అన్ని మండలాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని, కార్యకర్తలు అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు, మాజీ ఎమ్మెల్యే అరుణతార పిలుపునిచ్చారు. బుధవారం బిచ్కుందలో కార్యకర్తలు, నాయకులతో వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పాలను చూసి విసిగి పోయారన్నారు. కేంద్ర పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. నేతలు విష్ణు, రాములు సేట్‌, అరుణ్‌, విఠల్‌, పండరి పాల్గొన్నారు.

బాన్సువాడలో..

బాన్సువాడ/బాన్సువాడ రూరల్‌: మండలంలోని ప్రతి గ్రామంలో స్థానిక ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని మండల అధ్యక్షుడు మజ్జిగ శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం బాన్సువాడలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలన్నారు. నాయకులు ప్రభారి చీదర సాయిలు, శ్రీనివాస్‌, లక్ష్మీనారాయణ, దర్జీ మహేష్‌, దత్తు, నాగరాజు, సాయి రెడ్డి పాల్గొన్నారు.

నస్రుల్లాబాద్‌లో..

నస్రుల్లాబాద్‌: మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని మండల బీజేపీ అధ్యక్షుడు హన్మాండ్లు అన్నారు. బుధవారం మండలంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. నాయకులు మోహన్‌ రెడ్డి, వడ్ల సతీష్‌, లక్ష్మణ్‌, శేఖర్‌, నాగరాజు, దత్తు, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు

బాణాల లక్ష్మారెడ్డి

స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి 1
1/2

స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి

స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి 2
2/2

స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement