
విద్యా సంస్థల బంద్ విజయవంతం
సాక్షి నెట్‌వర్క్:విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యాసంస్థల బంద్ బుధవారం విజయవంతమైంది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్‌ను పాటించాయి. విద్యా సంస్థల యాజమాన్యాలు ముందు రోజే అధికారికంగా సెలవు ప్రకటించడంతో విద్యార్థులు పాఠశాలకు రాలేదు. బంద్‌కు పిలుపునిచ్చినా కొన్ని పాఠశాలలు, కళాశాలలు తెరవడంతో వాటిని దగ్గరుండి బంద్ చేయించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రైవేటు విద్యాసంస్థలలో ఫీజుల నియంత్రణ చట్టం తేవాలని, ఖాళీగా ఉన్న టీచర్స్, ఎంఈవో, డీఈవో పోస్టులను భర్తీ చేయాలని, పెండింగ్ స్కాలర్ షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని, ప్రభుత్వ విద్యా సంస్థలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

విద్యా సంస్థల బంద్ విజయవంతం

విద్యా సంస్థల బంద్ విజయవంతం

విద్యా సంస్థల బంద్ విజయవంతం