
ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలి
నస్రుల్లాబాద్: ప్రతి గ్రామంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు సైనికుడిలా పని చేయాలని బాన్సువాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జుబేర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు. నాయ కులు నర్సింలు గౌడ్, అల్లం రాము, టేకుర్ల సాయి, వెంకటి, సాయి కుమార్, మోసీన్, దత్తు, రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సమయానుసారం వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వాలి
పిట్లం(జుక్కల్): సమయానుసారం చిన్నపిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వాలని, తల్లిదండ్రులు సైతం బాధ్యతగా చిన్నపిల్లలకు వ్యా ధి నిరోధక టీకాలు ఇప్పించాలని జిల్లా ఇమ్యు నైజేషన్ అధికారి విద్య సూచించారు. ఆమె బుధవారం మద్దెలచెరువు, రాంపూర్ గ్రామాల ఆరోగ్య సబ్ సెంటర్లను సందర్శించారు. టీకాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు.
బీఎంఎస్ జెండా ఆవిష్కరణ
నాగిరెడ్డిపేట/లింగంపేట(ఎల్లారెడ్డి): గోపాల్‌పేటలో ఫ్రెండ్స్ ఆటో యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఎస్) 70వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాల్‌పేటలోని ఆటోస్టాండ్ వద్ద బీఎంఎస్ జెండాను ఆవిష్కరించారు. ఆటోవాలా సమస్యలపై పోరాడేందుకు బీఎంఎస్ ఎల్లవేళలా ముందుంటుందని ఆటో యూనియన్ సభ్యు లు పేర్కొన్నారు. అలాగే లింగంపేటలో బీఎంఎస్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు.
కేటీఆర్ సభను
విజయవంతం చేయాలి
గాంధారి: లింగంపేట మండల కేంద్రంలో శుక్రవారం జరిగే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభను విజయవంతం చేయాలని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పిలుపునిచ్చారు.బుధవారం ఆయన గాంధారి కి విచ్చేశారు. మండల కేంద్రంలోని షాదీఖానా లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశ మై మాట్లాడారు. కేటీఆర్ సభకు కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలి రావాలన్నారు. నాయకులు సి.సత్యం,మోహన్‌నాయక్, పత్తి శ్రీను, సాయిలు,సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
సభ ఏర్పాట్ల పరిశీలన
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంకు పరిసరాలను బుధవారం ఎల్లారెడ్డి సీఐ రాజిరెడ్డి పరిశీలించారు. ఈ నెల 25న బీఆర్‌ఎస్ పార్టీ తలపెట్టిన ఆత్మ గౌరవ గర్జన కార్యక్రమానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్న సందర్భంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. గత ఏప్రిల్‌లో అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఫ్లెక్సీ వివాదంలో మాజీ ఎంపీపీ ముదాం సాయిలును బట్టలూడదీసి లాక్కెల్లిన ఘటనకు నిరసనగా లింగంపేటలో ఆత్మగౌరవ గర్జన సభను ఏర్పాటు చేసినట్లు నేతలు తెలిపారు. సాయిలును కేటీఆర్ పరామర్శించనున్నారు. ఎస్సై దీపక్ ఉన్నారు.

ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలి

ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలి

ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలి

ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలి