
ప్రజావాణితో సమస్యల పరిష్కారం
సదాశివనగర్(ఎల్లారెడ్డి): ప్రజావాణితోనే సమస్యలను పరిష్కరించుకోవడానికి ఆస్కారం ఉంటుందని ఎంపీడీవో సంతోష్ కుమార్ సూచించారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు. ఎంపీవో సురేందర్ రెడ్డి, సీహెచ్‌వో నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
సైబర్ నేరాలతో జాగ్రత్త!
భిక్కనూరు: సైబర్ నేరాలపై జాగ్రత్త వహించా లని భిక్కనూరు ఎస్సై అంజనేయులు సూచించారు. సోమవారం భిక్కనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ప్రజా కళాజాత కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సైబర్ నేరాల బారిన పడితే 1930కు.. అత్యవసర సమయంలో 100 నంబర్‌కు డయల్ చేయాలని సూచించారు. యూట్యూ బ్, ఇస్ట్రాగామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా యాప్‌లతో జాగ్రత్తగా ఉండాలని సూచించా రు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ వి. శ్రీనివాస్, పోలీస్ కళాబృందం ఇన్చార్జి, హెడ్‌కానిస్టేబుల్ రామంచ తిరుపతి, శేషారావులు పాల్గొన్నారు.
ముగిసిన మొహర్రం ఉత్సవాలు
సాక్షి నెట్‌వర్క్:మత సామరస్యానికి ప్రతీకగా పల్లెల్లో భక్తిశ్రద్ధలతో జరుపుకునే పీర్ల పండుగ ఉత్సవాలు సోమవారంతో ముగిశాయి. నెలవంక కనిపించగానే ఆశీర్‌ఖానాల్లో కొలువుదీరిన పీర్లను ఆయా గ్రామాల మొల్లాలు, ఫకీర్లు, దూదేకుల కులస్తులు ఒక్కోరోజు ఒక్కోపీరును బంగారు, వెండి ఆభరణాలు, మల్లెపూలు, రంగురంగుల దట్టీలతో అందంగా అలంకరించి ఊరేగించారు. సోమవారం మొహర్రం ముగింపు ఉత్సవాల సందర్భంగా అన్ని పీర్లను బాజాభజంత్రీల నడుమ ఊరేగించగా ప్రజలు మొ క్కులు చెల్లించుకున్నారు. ఒడిబియ్యం పోసి సారెలు సమర్పించారు. వర్షంలోనూ అసయ్‌దూలా, మజ్నూ ఆటపాటలతో భక్తులు ఆకట్టుకున్నారు. సాయంత్రం పీర్లను స్థానిక చెరువుల్లో నిమజ్జనం చేశారు. పలుచోట్ల ప్రత్యేకంగా పాలతో చేసిన షర్బత్‌ను పంపిణీ చేశారు.

ప్రజావాణితో సమస్యల పరిష్కారం

ప్రజావాణితో సమస్యల పరిష్కారం