
మోస్తరు వర్షానికే మోకాల్లోతు నీరు..
అయ్యప్ప ఆలయానికి వెళ్లే దారిలో నిలిచిన వర్షపు నీరు
బాన్సువాడ : చినుకు పడితే చాలు పట్టణ రోడ్లు కుంటల్లా మారుతున్నాయి. అంతర్గత డ్రైయినేజీ లు అస్తవ్యస్తంగా మారడంతో మోస్తరు వర్షానికే రోడ్లపైకి మోకాల్లోతు నీళ్లు చేరుతున్నాయి. బా న్సువాడ పట్టణంలోని అయ్యప్ప ఆలయం రో డ్డు, అంబేడ్కర్ చౌరస్తా నుంచి పాత బాన్సువాడ కు వెళ్లే దారి, బేతాళస్వామి ఆలయం వద్ద, సా యికృపానగర్ కాలనీ, వాసవీకాలనీ, సంగమేశ్వ ర కాలనీ మూడో రోడ్డులో చివరి వీధి, చైతన్య కా లనీల్లో మోకాల్లోతు నీరు నిలుస్తోంది. రహదారులపై నీరు ఖాళీ అయిన తర్వాత బురద మేటలు తిష్టవేస్తున్నాయి. గతంలో రోడ్లపై ఏర్పడిన గుంతల్లో వర్షపు నీరు నిండిపోవడంతో వాహనాల రాకపోకలతో అవి మరింత పెద్దవిగా మారుతు న్నాయి. నీరున్నప్పుడు ఎక్కడ గుంత ఉందో తెలియక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. మురుగు నీరు రోడ్లపై పారుతుండడంతో పాదచారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు ప్రత్యేక దృష్టి సారించి రోడ్లపై నీరు నిలవకుండా డ్రెయినేజీలను బాగు చేయించాల ని ప్రజలు కోరుతున్నారు.
బాన్సువాడలో కుంటల్లా
మారుతున్న రహదారులు
అవస్థలు పడుతున్న వాహనదారులు

మోస్తరు వర్షానికే మోకాల్లోతు నీరు..