
స్పీడ్ బ్రేకర్లతో దెబ్బతిన్న బస్సు
మాచారెడ్డి: మండల కేంద్రంలోని బస్టాండ్‌లోకి వెళ్లే రోడ్డుపై ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్ల కారణంగా ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. వివరాలు ఇలా.. కరీంనగర్ నుంచి కామారెడ్డికి శనివారం ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఎక్స్‌ప్రెస్ బస్సు బయలుదేరింది. మార్గమధ్యలో మాచారెడ్డి బస్టాండ్‌లోకి వెళ్తుండగా రోడ్డుపై ఉన్న స్పీడ్ బ్రేకర్ల మూలంగా బస్సు అదుపుతప్పింది. దీంతో బస్సు లగేజీ బాక్సుల డోర్లు ఊడి కిందపడ్డాయి. అలాగే పలువురు ప్రయాణికులకు స్వల్పంగా గాయలైనట్టు స్థానికులు తెలిపారు. గతంలో కూడా రెండుసార్లు ఇదే స్పీడ్ బ్రేకర్ల వద్ద ప్రమాదాలు జరిగి పలువురు గాయపడ్డారు. ఆర్టీసీ అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్ల ఎత్తు తగ్గించాలని పలువురు కోరుతున్నారు.