
పోగొట్టుకున్న సెల్‌ఫోన్ అప్పగింత
కామారెడ్డి టౌన్: కామారెడ్డి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు జూబ్లీ బస్ స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ పెద్ద ఎత్తున ప్రయాణికులు ఎక్కారు. బస్సులో ఒక సెల్‌ఫోన్ కింద పడిపోవడంతో ప్రయాణికులు కండక్టర్‌కు అప్పగించారు. బస్సులో ఉన్న ప్రయాణికులకు ఫోన్ ఎవరిదని ప్రశించినా ఎవరు సమాధానం చెప్పలేరు. దీంతో సెల్‌ఫోన్ కండక్టర్ వద్దనే ఉంచుకున్నారు. బస్సు మేడ్చల్ ప్రాంతానికి రాగానే ఒక మహిళ లేచి తన ఫోను కనిపించడం లేదని గట్టిగా అరిచింది. దీంతో కండక్టర్ ఆమెను పిలిచి సెల్ ఫోన్ తన వద్ద ఉందని చెప్పి ఆమెకు సెల్ ఫోన్‌ను అప్పగించారు.

పోగొట్టుకున్న సెల్‌ఫోన్ అప్పగింత