
పౌష్టికాహారాన్ని అందించాలి
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం: చిన్నారులు, గర్భిణులకు పౌష్టికాహారాన్ని మాత్రమే అందించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మహిళ, శిశు అభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు.కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. పౌష్టికాహార లోపం గల పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నా రు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా అంగన్‌వాడీ కేంద్రాల పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు పిల్లలందరూ తప్పనిసరిగా వచ్చేలా పర్యవేక్షించాలని సీడీపీవోలు, సూపర్వైజర్‌లను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న అంగన్‌వాడీ భవనాల నిర్మాణం, మరుగుదొడ్లు, తాగునీటి వసతులు, విద్యుత్ తదితర పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజినీరింగ్ శాఖల అధికారులను ఆదేశించారు. స్ధానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్ నాయక్, డీఎంహెచ్‌వో చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇందిరా సౌరగిరి జల వికాసం..
పోడు పట్టాలున్న గిరిజన రైతులకు లాభసాటి వ్యవసాయం జరిగేలా ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం ఎంతగానో తోడ్పడుతుందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్‌లో ఇందిర సౌర గిరి జల వికాసం పథకంపై ఏర్పాటు చేసిన స మావేశంలో మాట్లాడారు. ఈ పథకం ద్వారా పోడు పట్టాలు పొందిన లబ్ధిదారులకు బోరు మోటర్, సోలార్ పంప్‌సెట్లు మంజూరు చేసి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. లబ్ధిదారులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోడానికి ఎంపీడీవో కార్యాలయాల్లో సంప్రదించాలన్నారు. డీఎఫ్‌వో నిఖిత, అదనపు కలెక్టర్ చందర్ నాయక్, ఆర్డీవో వీణ, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి సతీష్ యాదవ్, డీఆర్‌డీవో సురేందర్, డీపీవో మురళి, డీఏవో తిరుమల ప్రసాద్, ఉద్యానవన అధికారిణి జ్యోతి, డీటీవో శ్రీనివాస్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.