
ఎల్లారెడ్డి ఆర్డీవోగా పార్థసింహారెడ్డి
ఎల్లారెడి:్డ ఎల్లారెడ్డి ఆర్డీవోగా పార్థసింహారెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. హైద్రాబాద్ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న పార్థసింహారెడ్డి ఎల్లారెడ్డికి ఆర్డీవోగా బదిలీపై వచ్చి ఛార్జి తీసుకున్నారు. గత నెలలో ఆర్డీవోగా విధులు నిర్వర్తించిన మన్నె ప్రభాకర్ పదవీ విరమణ పొందడంతో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి కొద్ది రోజులు ఆర్డీవోగా వ్యవహరించగా గత నెల 24న కామారెడ్డి ఆర్డీవోకు ఇన్‌ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు.
బాధ్యతలు స్వీకరించిన ఎంపీడీవోలు
బాన్సువాడ రూరల్: బాన్సువాడ ఎంపీడీవోగా ఆనంద్ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. మెదక్ జిల్లా నుంచి బదిలీపై వచ్చిన ఆనంద్‌కు ఇన్‌ఛార్జి ఎంపీడీవో ముజాహిద్ బాధ్యతలు అప్పగించారు.
పిట్లంలో రఘు..
పిట్లం(జుక్కల్): స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఎంపీడీవోగా రఘు బాధ్యతలు స్వీకరించారు. పిట్లం ఎంపీడీవోగా పనిచేసిన కమలాకర్ బదిలీపై రెంజల్‌కు వెళ్లగా, ఆయన స్థానంలో మెదక్ నుంచి బదిలీపై రఘు పిట్లంకు వచ్చారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది నూతన ఎంపీడీవో రఘుకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉంటూ మండల అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
రాజంపేటలో బాలకృష్ణ..
రాజంపేట: రాజంపేట మండల ఎంపీడీవోగా ఎ.బాలకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకు ధర్పల్లి మండలంలో ఎంపీడీవోగా విధులు నిర్వహించిన బాలకృష్ణ బదిలీపై రాజంపేట మండలానికి వచ్చారు. ఈ సందర్భంగా ఎంపీవో రామకృష్ణ, మండల పరిషత్ సిబ్బంది శాలువాతో సత్కరించారు.
రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై గురువారం పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్సై జగదీశ్ మాట్లాడుతూ...ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారు తప్పకుండా హెల్మెట్ ధరించాలన్నారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న చలాన్‌లను చెల్లించాలని సూచించారు. హెల్మెట్ లేని వాహనదారులకు జరిమానాలు విధించారు.

ఎల్లారెడ్డి ఆర్డీవోగా పార్థసింహారెడ్డి

ఎల్లారెడ్డి ఆర్డీవోగా పార్థసింహారెడ్డి

ఎల్లారెడ్డి ఆర్డీవోగా పార్థసింహారెడ్డి