
గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
కామారెడ్డి క్రైం: ఇతర ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకువచ్చి యువతకు విక్రయించే ఓ వ్యక్తిని కామారెడ్డి ఎకై ్సజ్ పోలీసులు గురువారం పట్టుకున్నారు. వివరాలు ఇలా.. హైదరాబాద్‌కు చెందిన అహ్మద్ బిన్ అసద్ అనే వ్యక్తి కొంత కాలంగా కామారెడ్డిలో నివాసం ఉంటున్నాడు. అతడు గంజాయి ప్యాకెట్‌లను విక్రయిస్తుంటాడని సమాచారం రావడంతో పోలీసులు నిఘా పెట్టారు. గురువారం సాయంత్రం పట్టణ సమీపంలోని నర్సన్నపల్లి రైల్వే గేటు వద్ద అతడిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 550 గ్రాముల గంజాయి పట్టుబడింది. నిందితుడిని అరెస్ట్ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ సుందల్ సింగ్ తెలిపారు. కేసు నమోదు చేశామన్నారు.