
చివరి గింజా కొనుగోలు చేయాలి
తుజాల్‌పూర్‌లో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్
బీబీపేట: రైతుల వద్దనున్న చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని నిర్వాహకులకు కలెక్టర్ సంగ్వాన్ సూచించారు. మంగళవారం ఆయన బీబీపే ట మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. తుజాల్‌పూర్‌లోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్, విత్తనాల దుకాణాన్ని తనిఖీ చేశారు. ప్రభు త్వం అనుమతించిన విత్తనాలు, ఎరువులనే అమ్మాలన్నారు. బీబీపేట్‌లో స్వరూప ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసి, మంజూరు పత్రాన్ని అందించారు. ఎంపీడీవో కార్యాలయంలో చేపట్టిన మోడల్ ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు. బీబీపేట పీహెచ్‌సీని పరిశీలించి రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని మెడికల్ ఆఫీసర్‌కు సూచించారు. పలువురు సిబ్బంది హాజరు రిజిష్టర్లో సంతకాలు చేయకపోవడంతో విధుల్లో లేనివారి వివరాలు తెలుసుకున్నారు. సూపర్‌వైజర్ సత్యానంద్ అనధికార సెలవు లో ఉండడాన్ని గమనించి అతడిని సస్పెండ్ చేయా లని డీఎంహెచ్‌వోను ఆదేశించారు. అదనపు డీఎంహెచ్‌వో, ప్రోగ్రాం ఆఫీసర్స్ విధుల్లో లేకపోవడంతో వారికి నోటీస్‌లు జారీచేయాలని సూచించారు. ఖాళీ స్థలంలోని చెత్తను తొలగించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని మెడికల్ ఆఫీసర్‌ను ఆదేశించారు. ఆయన వెంట డీసీవో రామ్మోహన్, డీఏవో తిరుమల ప్రసాద్, హౌసింగ్ పీడీ విజయపాల్‌రెడ్డి, డీఎంహెచ్‌వో చంద్రశేఖర్, మెడికల్ ఆఫీసర్ భానుప్రియ, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీవో పూర్ణచందర్ తదితరులున్నారు.