
మండుటెండల్లో నీటి ఊటలు
బీబీపేట: ప్రతి ఏడాది వేసవిలో గుక్కెడు నీటి కోసం మనుషులతో పాటు పశువులు సైతం అల్లాడిపోతుంటాయి. అలాంటిది ఈ ఏడాదిలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కుంటలు నిండిపోయాయి. అంతే కాకుండా వర్షాలు వరుసగా కురవడంతో గుట్టల నుంచి నీటి ఊటలు పారుతున్నాయి. యాడారం గ్రామంలోని గుట్టల్లో నీటి ఊటలు పారుతున్న దృశ్యం సాక్షి కెమెరాకు చిక్కింది. గ్రామాల్లో నీరు నిండడంతో పశువులకు నీటికి ఇబ్బందులు తలెత్తకుండా ఉంది. మండే ఎండల్లో వర్షాలు పడుతుండడంతో వ్యవసాయం చేసే రైతుల్లో కూడా ఆనందం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది పంటలు సైతం ముందుగానే వేసే అవకాశం ఉందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
● నాలుగు రోజులుగా కురుస్తున్న
వర్షాలకు నిండిన కుంటలు

మండుటెండల్లో నీటి ఊటలు