
అందుబాటులో జీలుగ విత్తనాలు
లింగంపేట/ నాగిరెడ్డిపేట: వానాకాలం సీజన్ కోసం జీలుగ(పచ్చిరొట్టె) విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు లింగంపేట మండల వ్యవసాయాధికారి అనిల్‌కుమార్ ఆదివారం తెలిపారు. మండలంలోని శెట్పల్లిసంగారెడ్డి, నల్లమడుగు, లింగంపేట సొసైటీల్లో వంద బస్తాల చొప్పున జీలుగ విత్తనాలు నిలువ ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఒక్కో బస్తా 30 కిలోలు 50 శాతం సబ్సిడీతో రూ. 2137.50కు అందిస్తున్నట్లు తెలిపారు. విత్తనాలు అవసరం ఉన్న రైతులు పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్సులతో ఏఈవోలను సంప్రదించాలన్నారు. రైతులు సాగు చేసేందుకు అవసరమైన జీలుగ విత్తనాలు సబ్సిడీపై అందించనున్నట్లు నాగిరెడ్డిపేట ఏవో సాయికిరణ్ తెలిపారు. మండలంలోని మాల్తుమ్మెద సోసైటీకి వంద బస్తాలు, తాండూర్ సొసైటీకి వంద బస్తాల చొప్పున మండలానికి మొత్తం సరఫరా అయినట్లు పేర్కొన్నారు. జీలుగ విత్తనాలు అవసరమైన రైతులు వారి పట్టాపాస్ పుస్తకంతోపాటు ఆధార్‌కార్డ్ జిరాక్స్‌లతో సంబంధిత ఏఈవోను సంప్రదించాలన్నారు.
మహమ్మద్‌నగర్‌లో విత్తనాల పంపిణీ
నిజాంసాగర్: మహమ్మద్‌నగర్ మండల కేంద్రంలో జీలుగ విత్తనాలను సొసైటీ చైర్మన్ చేతుల మీదుగా అధికారులు రైతులకు ఆదివారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి నవ్య, ఏఈవో రేణుక, సొసైటీ సీఈవో రాములు, సిబ్బంది సాయి తేజ, భాస్కర్, కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

అందుబాటులో జీలుగ విత్తనాలు