
ట్యాంకర్లతో నీటి సరఫరా
పిట్లం: పిట్లం జీపీ పరిధిలోని పలు కాలనీల్లో ట్యాంకర్ల ద్వారా జీపీ సిబ్బంది నీటిని సరఫరా చేస్తున్నారు. జీపీ కార్యదర్శి బల్‌రాం మాట్లాడుతూ.. పంచాయతీ పరధిలోని రాజీవ్‌గాంధీ కాలనీలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. దీంతో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే బుడజంగం, ఎస్సీ కాలనీలో సైతం నీటి ఎద్దడి ఉండటంతో ట్యాంకర్ల ద్వారా నీటిని అందించినట్లు తెలిపారు.
ఎల్లారెడ్డిలో తిరంగా ర్యాలీ
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డిలో బీజేపీ నాయకులు ఆదివారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదులపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంతో ర్యాలీ నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు, బాణాల లక్ష్మారెడ్డి, బాపురెడ్డి, రాంరెడ్డి, నేరేళ్ల ఆంజనేయులు, రవీందర్‌రావు, నర్సింలు, రాజేశ్, దేవేందర్, బాలకిషన్, నక్కగంగాధర్, ప్యాలాల రాములు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్మీజవాన్‌కు సన్మానం
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు ఆర్మీ జవాన్ క్యాస దేవేందర్‌ను ఆదివారం సన్మానించారు. ఎల్లారెడ్డిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆపరేషన్ సిందూర్ కార్యక్రమంలో భాగంగా చైనా బార్డర్‌లో విధులు నిర్వర్తించి ఇటీవల స్వగ్రామమైన సోమార్‌పేట్‌కు వచ్చిన దేవేందర్‌ను వారు శాలువాతో సన్మానించారు. జై భారాత్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో నాయకులు బాణాల లక్ష్మారెడ్డి, నేరేల్ల ఆంజనేయులు, బాపురెడ్డి, రాంరెడ్డి, నర్సింలు, రాజేశ్, దేవేందర్, బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.
సంతలో కూరగాయల కొరత
భిక్కనూరు: మండల కేంద్రంలో నిర్వహించే వారాంతపు సంతలో కూరగాయల కొరత ఏర్పడింది. రామేశ్వర్‌పల్లిలో బోనాల పండుగను ఆదివారం నిర్వహించినందున ఆగ్రామానికి చెందిన రైతులు అంగడికి రాలేదు. ప్రతి వారం ఆ గ్రామానికి చెందిన రైతులు అధిక సంఖ్యలో భిక్కనూరు సంతకు వచ్చి కూరగాయలను విక్రయిస్తుంటారు. ఈ ఆదివారం వారు రాకపోవడంతో కూరగాయల కొరత ఏర్పడింది. దీంతో సంతకు వచ్చిన కొనుగోలు దారులు ఇబ్బందులు పడ్డారు.

ట్యాంకర్లతో నీటి సరఫరా

ట్యాంకర్లతో నీటి సరఫరా