
నకిలీ విత్తనాలు అమ్మితే లైసెన్సులు రద్దు
మద్నూర్(జుక్కల్): రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే లైసెన్స్‌లు రద్దు చేసి చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయశాఖ ఏడీఏ అపర్ణ అన్నారు. మండల కేంద్రంలోని విత్తనాలను శుక్రవారం కామారెడ్డి విత్తన తనిఖీ బృందం అధికారులు, ఏడీఏ తనిఖీలు నిర్వహించారు. విత్తన దుకాణాల్లో, గోదాముల్లో దుకాణదారులు స్టోర్ చేసి పెట్టుకున్న విత్తనాల బ్యాగులను పరిశీలించారు. అనంతరం ఏడీఏ మాట్లాడుతూ.. రానున్న వానాకాలం పంటలకు సంబంధించి రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలని డీలర్లను ఆదేశించారు. విత్తనాల కంపెనీల వివరాలు, పీసీలు, బిల్లులు, ఇన్‌వాయిస్ ఉంచుకోవాలన్నారు. రైతులకు విక్రయించే విత్తనాలకు రసీదులు తప్పకుండా ఇవ్వలన్నారు. రైతులు లైసెన్స్‌లు కలిగిన డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలని ప్యాకింగ్ లేనివి, దళారుల వద్ద విత్తనాలు తీసుకోరాదన్నారు. విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. విత్తన తనిఖీ బృందం కామారెడ్డి ఏవో పవన్‌కుమార్, బీబీపేట్ ఏవో నరేంద్ర, ఏవో రాజు, డీలర్లు పాల్గొన్నారు.
ఏడీఏ అపర్ణ
మద్నూర్‌లో విత్తన దుకాణాల తనిఖీ