
బడి బాగుకు ఒక్కటయ్యారు
మాచారెడ్డి : తమకు విద్యాబుద్ధులు నేర్పిన బడి బాగు కోసం పూర్వ విద్యార్థులు నడుం బిగించారు. ఉనికి కోల్పోతున్న చదువుల చెట్టుకు పూర్వ వైభవం తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆ పాఠశాలలో చదువుకొని ఉన్నతంగా ఎదిగిన పలువురు ఉద్యోగులు, వృత్తి నిపుణులు తలా కొంత డబ్బులు జమ చేసి పాఠశాల అభివృద్ధికి పాటుపడుతున్నారు. పాల్వంచ మండలం ఫరీదుపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు జమ చేసిన రూ.10 లక్షలతో పాఠశాలలో విద్య, క్రీడ, కళారంగాల్లో రాణిస్తున్న విద్యార్థులకు ప్రోత్సాహకాలు, ఐఐటీ ఫౌండేషన్, కంప్యూటర్ బోధన, పోటీ పరీక్షల కోసం శిక్షణ, వ్యక్తిత్వ వికాసం తదితర కార్యక్రమాలు చేపట్టనున్నట్టు పూర్వ విద్యార్థులు తెలిపారు.
బడిబాట నిర్వహిస్తున్న పూర్వ విద్యార్థులు (ఫైల్)
అందరూ కదులుతున్నారు
చిన్నప్పుడు చదువుకున్న పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు భరోసా ఇస్తున్నారు. ఈ బడి అభివృద్ధి కోసం ఇక్కడ చదివిన అన్ని బ్యాచ్‌ల విద్యార్థులు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు.
– కె.వెంకటి, స్కూల్ అసిస్టెంట్, పూర్వ విద్యార్థి
నిధులు సమకూరుస్తా...
పాఠశాలకు పూర్వ వైభ వం తెచ్చేందుకు పూర్వ విద్యార్థులంతా ముందుకు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. బ డి అభివృద్ధికోసం ప్ర భుత్వం నుంచి నిధులు తీసుకురావడానికి నా వంతుగా ప్రయత్నాలు చేస్తా.
– పి.రమేశ్‌గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, పూర్వ విద్యార్థి
బడి రుణం తీర్చుకునేందుకు...
ఓనమాలు దిద్దిన బడి రుణం తీర్చుకోవడానికి ఒక్కటిగా కదిలాం. పూ ర్వ విద్యార్థుల సమావే శం ఏర్పాటు చేసి చర్చించాం. విద్యార్థుల కు కార్పొరేట్ స్థాయిలో చదువు అందించేందు కు కలిసి కృషి చేస్తున్నాం. – వి.శంకర్,
అసిస్టెంట్ ప్రొఫెసర్, పూర్వ విద్యార్థి
పాఠశాల అభివృద్ధికి..
మేము చదువుకున్న పా ఠశాలను అభివృద్ధి చే యాలని సంకల్పించాం. పాఠశాలలోని సమస్య లను పరిష్కరించడంతో పాటు మెరుగైన వి ద్యనందించేందుకు సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. – ఎం.సిద్దిరాంరెడ్డి,
జిల్లా సైన్స్ అధికారి, పూర్వ విద్యార్థి
సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇస్తూ..
పూర్వ విద్యార్థులు ఇటీవల గ్రామంలో బ డిబాట నిర్వహించారు. ప్రైవేటు పాఠశాల లకు వెళుతున్న దాదాపు 150 మంది వివ రాలను నమోదు చేసుకున్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సౌకర్యాలు కల్పించి నీట్, జేఈఈ, ఏప్‌సెట్ తదితర పరీక్షలకు విద్యార్థులను తీర్చిదిద్దేందుకు అవసరమై న ఫ్యాకల్టీని తాము ఏర్పాటు చేస్తామని త ల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. దీంతో చా లామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని స ర్కారు బడిలో చేర్పించడానికి ఆసక్తి చూ పుతున్నారు.
సర్కారు బడిలో సదుపాయాల
కల్పనకు రూ.10 లక్షలు జమ
పిల్లలను చేర్పించాలంటూ బడిబాట
ఆదర్శంగా నిలుస్తున్న ఫరీదుపేట పూర్వ విద్యార్థులు

బడి బాగుకు ఒక్కటయ్యారు

బడి బాగుకు ఒక్కటయ్యారు

బడి బాగుకు ఒక్కటయ్యారు

బడి బాగుకు ఒక్కటయ్యారు