
మారుతున్న కాలంతోపాటు టీచర్లు అప్డేట్ కావాలి
● ఉమ్మడి జిల్లా డైట్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్
కామారెడ్డి రూరల్: మారుతున్న కాలంతోపాటు ఉపాధ్యాయులు అప్డేట్ కావాలని నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లా డైట్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ సూచించారు. గురువారం కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలోని జెడ్పీహెచ్ ఎస్‌లో నిర్వహిస్తున్న సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ శిక్షణ శిబిరాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ట్రైనింగ్ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ... ఉపాధ్యాయులకు ఏ డిజిటల్ ఉపకరణం కాదని పేర్కొన్నారు. విద్యార్థుల్లో సామాజిక స్పృహ పెంచాలని, సామాజిక సర్దుబాటులు నేర్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో కామారెడ్డి మండల విద్యాధికారి వై. ఎల్లయ్య, రాష్ట్ర రిసోర్స్ పర్సన్ డా. సుభాష్, డీఆర్పీలు ప్రసూన్, బాలరాజ్, రాజభైరయ్య, ఎనిమిది మండలాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.